India vs Australia 2nd T20 : Krunal Pandya Clean Bowls Glenn Maxwell, Video Goes Viral | Oneindia

2018-11-23 892

Krunal Pandya removed Aussies Glenn Maxwell as they lost their fifth wicket, and Pandya bagged his first in the series. Earlier, in the first T20I Pandya had an outing to forget as he conceded 55 runs in four overs. It was Glenn Maxwell smashed him for 3 sixes in an over.
#IndiavsAustralia2ndT20
#LiveCricketScore
#INDvsAUS
#rohitsharma
#KrunalPandya
#GlennMaxwell

మెల్‌బోర్న్ వేదికగా ఆతిథ్య ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టీ20లో ఈ మ్యాచ్‌లో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్‌ యాదవ్‌, కృనాల్‌ పాండ్యా పోటాపోటీగా బంతులు వేస్తున్నారు. ఆసీస్ బ్యాట్స్‌మన్‌ను పరుగులు చేయకుండా కట్టడి చేస్తున్నారు. తొలి టీ20లో ధారాళంగా పరుగులు సమర్పించుకున్న కృనాల్ పాండ్యా ఈ మ్యాచ్‌లో చెలరేగుతున్నాడు. బ్రిస్బేన్ వేదికగా జరిగిన తొలి టీ20లో ఆసీస్ బ్యాట్స్‌మన్ మాక్స్‌వెల్ ‘హ్యాట్రిక్ సిక్సర్ల'కి ఈ మ్యాచ్‌లో కృనాల్ పాండ్యా బదులు తీర్చుకున్నాడు. కృనాల్ పాండ్యా వేసిన ఇన్నింగ్స్ 11వ ఓవర్ ఆఖరి బంతికి మ్యాక్స్ వెల్ (19) పరుగుల వద్ద ఔటయ్యాడు. ఈ ఔట్ మ్యాచ్‌కే హైలెట్‌గా నిలిచింది. పాండ్యా వేసిన బంతిని ఆడే క్రమంలో మ్యాక్స్‌వెల్ బ్యాట్‌ని అడ్డుపెట్టినప్పటికీ, అది గిర్రున తిరుగుతూ వికెట్లను గిరాటేసింది.